నీటి సంపులో పడి వ్యక్తి మృతి
పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీలో గల శివరామకృష్ణ ఇండస్ట్రీస్ లోని నీటి సంపులో పడి కూలీ మృతి చెందాడు.
దిశ, కోరుట్ల రూరల్ : పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీలో గల శివరామకృష్ణ ఇండస్ట్రీస్ లోని నీటి సంపులో పడి కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం బీహార్ కు చెందిన సచిన్ చౌదరి(38) రైస్ మిల్లులో గత కొద్ది కాలంగా కూలి పని చేస్తున్నాడని, రైస్ మిల్లులో బాయిలర్ కు వాడే నీటి సంపు వద్ద సచిన్ కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు జారి నీటి సంపులో పడి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.