కాపాడండి అంటూ ప్రాధేయపడినా... ఫోటోలకే ప్రాధాన్యనిచ్చిన ప్రజలు..

అయ్యో ఎంత పనాయే.. రెప్పపాటు సమయంలోనే ఇంత ఘోరం జరిగింది.

Update: 2024-11-21 05:21 GMT

దిశ, కీసర : అయ్యో ఎంత పనాయే.. రెప్పపాటు సమయంలోనే ఇంత ఘోరం జరిగింది. రెండు కాళ్ళు విరిగిపోయి.. ప్రాణాలతో విలవిలలాడుతూ.. నడి రోడ్డు పై కొట్టుమిట్టాడుతుంటే... జనాలు చూస్తూ ఫోటోలు తీస్తున్నారే తప్ప.. అతడి వద్దకు వెళ్ళి సపర్యలు చేసిన వారే లేరు. సమాజంలో మానవత్వం చచ్చిపోయిందా.. సకాలంలో స్పందిస్తే ప్రాణాలతో బ్రతికేవాడు.. ఈ విషాదకర ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కు చెందిన వి.ఎలేందర్ (35) భార్య, ఇద్దరి పిల్లలతో కలిసి రాంపల్లి చౌరస్తాలో నివాసముంటున్నాడు.

బుధవారం సాయంత్రం పనుల నిమిత్తం కీసర వైపు స్కూటీ మీద వెళ్తుండగా కీసర రింగ్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలేందర్ రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఎలేందర్ కాపాడమని చుట్టూ ఉన్న జనాలను వేడుకున్నా.. అంబులెన్సు వచ్చే వరకు ఒక్కరూ ముందుకు రాలేదు. అంబులెన్సులో ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. లారీ డ్రైవర్ గుర్రాల లక్ష్మణ్ (27) పోలీసులు కేసు నమోదు చేశారు.


Similar News