స్కూల్ కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం..
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది.
దిశ, కూకట్ పల్లి : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. బుధవారం రోజు వారి మాదిరిగానే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదిరిగుట్టకు చెందిన లక్ష్మీ దుర్గ(13), హారిక(13)లు వివేకానంద నగర్‌లోని చైతన్య టెక్నో స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు. బుధవారం స్కూల్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు ఇంటికి తిరిగి రాగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన లక్ష్మీ దుర్గ హారికలు స్కూల్ నుంచి సాయంత్రం 4:26 నిమిషాలకు బయటికి వచ్చి పక్కనే అన్న ఓ నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి తమతో పాటు తెచ్చుకున్న బట్టలను మార్చుకున్నారు.
అక్కడి నుంచి ఇద్దరు బయటికి వెళ్లారు. ఇది ఇలా ఉండగా దుర్గ, హరికలు క్లాస్ రూం లో సూర్యలంక బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేసినట్టు తెలిసింది. కాకుండా దుర్గ సొంతూరు సూర్యలంక బీచ్ సమీపంలోని అక్కడికి వెళ్ళాలని తరచుగా మాట్లాడుకునే వారని పోలీసుల విచారణలో తెలిసింది. కాకుండా ఇన్స్తా గ్రాం ద్వారా పరిచయం అయిన ఓ అబ్బాయి వీరికి టచ్ లో ఉన్నట్టు, ఇన్ స్టాగ్రామ్ తోటి స్నేహితులకు అక్కడి ఫోటోలు పెడుతూ ట్యాగ్ చేస్తున్నట్టు తెలిసింది. సూర్య లంక బీచ్ సమీపంలో అన్న పోలీస్ స్టేషన్ తో పాటు కూకట్ పల్లి పోలీస్ సిబ్బంది విద్యార్ధినుల కోసం గాలిస్తున్నారు.