క్షణికావేశం.. తండ్రి చేతిలో తనయుడు బలి

క్షణికావేశంలో ఓ తండ్రి తన కొడుకును కూరగాయలు కట్

Update: 2024-11-09 06:44 GMT

దిశ,ఎల్బీనగర్: క్షణికావేశంలో ఓ తండ్రి తన కొడుకును కూరగాయలు కట్ చేసే కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్ ఘాట్ న్యూ మారుతి నగర్ ప్రాంతానికి చెందిన వి. రాములు కుమారుడు వీరనగరి జైపాల్ (23) డిగ్రీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు. కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తండ్రి రాములు కుమారుడు జైపాల్ ను చదువు పూర్తి చేయకుండా పని పాట లేకుండా జులయిగా తిరుగుతున్నావని మందలించాడు.

ఈ విషయంలో మాట్లాడుతుండగా తీవ్ర కోపోద్రిక్తుడైన తండ్రి రాములు కూరగాయలు కట్ చేసే కత్తితో కుమారుడు జైపాల్ మెడ పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం జరగడం తో జైపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు జైపాల్ ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైపాల్ రాత్రి 10:30 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News