విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో మల్లేష్ (36) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని కదిరిదేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2023-05-27 16:30 GMT

దిశ, కల్యాణదుర్గం: విద్యుత్ షాక్ తో మల్లేష్ (36) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని కదిరిదేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేష్ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలోనే కొత్త ఇంటి నిర్మాణం పనులు కోసం ఇంటి ముందు నీటి సంపును ఏర్పాటు చేశాడు. అయితే నీటి సంపులో కరెంట్ తీగలు పడడంతో దానిని గమనించని మల్లేశ్ నీటిలో సంపులోకి దిగాడు. అప్పటికే కరెంట్ నీటి సంపులోకి సప్లై కావడంతో కరెంట్ షాక్ తగిలి నీటిలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News