చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ దిబ్బపాలెం గ్రామానికి చెందిన కొవిరి మసేను( 30) తండ్రి కృష్ణ ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాంతంలో సముద్రంలో, కోవిరి మసేను మరి కొందరు మత్స్యకారులు చేపల వేట చేస్తూవుండగా ప్రమాద శాత్తు సముద్రంలో గల్లంతయ్యారు

Update: 2024-12-29 14:02 GMT

దిశ ప్రతినిధి,అనకాపల్లి: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ దిబ్బపాలెం గ్రామానికి చెందిన కొవిరి మసేను( 30) తండ్రి కృష్ణ ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాంతంలో సముద్రంలో, కోవిరి మసేను మరి కొందరు మత్స్యకారులు చేపల వేట చేస్తూవుండగా ప్రమాద శాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. తనతో పాటు వెళ్లిన మత్స్యకారులు వెతకగా మసేను మృతదేహం మత్స్యకారులకి కనిపించింది. అప్పటికే చనిపోయారు అని నిర్ధారణ చేసుకుని పరవాడ పోలీసులు సీఐ, మత్స్యశాఖ అధికారులు, పంచాయతీ అధికారులకి తెలియజేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపంచనామానికి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కి పంపించారు. అనంతరం తిరిగి ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయతీకి తీసుకొచ్చారు. దిబ్బపాలెం స్మశాన వాటికలో అంత్యక్రియలలో గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, హాజరై మాట్లాడుతూ.. ఈ పెద మత్స్యకార మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు , రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మృతిని కుటుంబానికి ఎక్సగ్రేషియా, చంద్రన్న బీమా , పథకం మంజూరు చేయాలని కోరారు. మత్స్యకారుని అంత్యక్రియలలో గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, ఎంపిటిసి అర్జిల్లి రవిదేవి, మండల కో ఆప్షన్ సభ్యులు మైలపల్లి అప్పన్న, మాజీ ఎంపిటిసి చింతకాయల అమ్మోరు, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు కోవిరి ముత్యాలు మరియు మృతిని కుటుంబ సభ్యులు, మరియు స్థానిక మత్స్యకార నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News