Bihar minister: రోడ్డు ప్రమాదంలో బిహార్ మంత్రి రత్నేశ్ సదాకి గాయాలు

కొత్తసంవత్సరం వేళ బిహార్‌ (Bihar) ఎక్సైజ్‌ శాఖ మంత్రి రత్నేశ్‌ సదా (Ratnesh Sada) ప్రమదానికి గురయ్యారు.

Update: 2025-01-01 09:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొత్తసంవత్సరం వేళ బిహార్‌ (Bihar) ఎక్సైజ్‌ శాఖ మంత్రి రత్నేశ్‌ సదా (Ratnesh Sada) ప్రమదానికి గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మంత్రిని టెంపో ఢీకొట్టడంతో గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి రత్నేశ్‌ సదా నూతన సంవత్సర వేడుకల కోసం స్వగ్రామం బలియాకు వెళ్లారు. తెల్లవారుజామున మంత్రి, ఆయన సోదరుడు, భద్రతా సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన వారిని టెంపొ ఢీకొట్టడంతో మంత్రి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సదర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే, మంత్రికి బీపీ, షుగర్ ఉండటంతో వైద్యులు టెస్టులు చేశారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్ తర్వాత మంత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు ముందు ఆ టెంపో మరో ఇద్దరిని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News