Kerala: కేరళలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 111 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ట్యూషన్ టీచర్(Kerala tuition teacher) కు కేరళ కోర్టు 111 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధించింది.
దిశ, నేషనల్ బ్యూరో: బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ట్యూషన్ టీచర్(Kerala tuition teacher) కు కేరళ కోర్టు 111 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ తిరువనంతపురం(Thiruvananthapuram)లోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు(special fast-track cour) తీర్పు ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువులోగా మనోజ్ జరిమానా చెల్లించడంతో విఫలమైతే, అదనంగా మరో ఏడాది జైలు శిక్ష విధించాలని కోర్టు తెలిపింది.ఐదేళ్ల క్రితం బాలికను ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో 44 ఏళ్ల ట్యూటర్ మనోజ్ ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రేఖ.. దోషి మనోజ్ దారుణమైన నేరానికి పాల్పడినట్లు మండిపడ్డారు. 11వ తరగతి విద్యార్థినికి సంరక్షకుడిగా ఉండాల్సిన ట్యూటర్.. ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం ఘోరమని వ్యాఖ్యానించారు.
బాలికపై అత్యాచారం
ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్ కుమార్ తన ఇంట్లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. కాగా.. 2019, జులై 2న అతను 11వ తరగతి బాలికను స్పెషల్ క్లాస్ సాకుతో ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా.. ఆమె అశ్లీల ఫొటోలను కూడా తీసుకున్నాడు. ఈ ఘటన తర్వతా బాలిక తల్లిదండ్రులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్ లో ట్యూటర్ పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మనోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. అయితే, అందులో బాలిక అశ్లీల ఫొటోలను అధికారులు గుర్తించారు. కాగా..ఘటన జరిగిన రోజు తాను ఆఫీస్ లోనే ఉన్నానన్న వాదనలు కోర్టు తోసిపుచ్చింది. మనోజ్ ఆఫీస్ లో లేడని ఆయని శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇకపోతే, బాలికపై తన భర్త చేసిన నేరం గురించి తెలుసుకున్న మనోజ్ భార్య ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.