చెరువులో పడి మత్స్యకారుడు మృతి..
తాండూరు గ్రామానికి చెందిన కంపెల్ల బాపు (62) అనే మత్స్యకారుడు బుధవారం చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సమ్మయ్య తెలిపారు.
దిశ, తాండూర్ : తాండూరు గ్రామానికి చెందిన కంపెల్ల బాపు (62) అనే మత్స్యకారుడు బుధవారం చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సమ్మయ్య తెలిపారు.
ద్వారాకపూర్ గ్రామశివారులో గల రాముని చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకుని బాపు మృతి చెందాడని ఎస్సై చెప్పారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.