కన్న కొడుకును కిరాతకంగా హత్య చేసిన తండ్రి..

కన్న కొడుకును కిరాతకంగా సొంత తండ్రి హత్య చేసిన సంఘటన మాడుగుల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-11-07 07:49 GMT

దిశ, ఆమనగల్లు (మాడుగుల) : కన్న కొడుకును కిరాతకంగా సొంత తండ్రి హత్య చేసిన సంఘటన మాడుగుల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి గుడి తండా గ్రామానికి చెందిన రాత్లావత్ లక్ష్మణ్ కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు కలరు. పెద్ద కొడుకు నరేష్, చిన్న కొడుకు సురేష్ లు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 40 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు. అక్టోబర్ 11న దసరా పండుగ సందర్భంగా సొంత గ్రామానికి వారు వచ్చారు. అక్టోబర్ 13వ తేదీన తండ్రి లక్ష్మన్ పెద్దకొడుకు నరేష్ ఇద్దరు కలిసి మద్యం మత్తులో చిన్న కొడుకు సురేష్ ను కిరాతకంగా మటన్ కొట్టే కత్తితో గొంతు పైన పలుసార్లు దాడి చేసి చంపినట్లు సీఐ తెలిపారు.

అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకువెళ్లి పొలంలో గుంతలో వేసి పూడ్చినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మణ్, పెద్దకొడుకు నరేష్ లు ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాదుకు వెళ్ళారు. గురువారం మాడుగుల పోలీస్ స్టేషన్ కునిందితులు వచ్చి, చేసిన తప్పును ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు గల కారణాలు ఆస్తి గొడవలు, కొట్లాటలు అనే ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం సమగ్ర సమాచారం తెలుపుతామని సీఐ తెలిపారు.

Tags:    

Similar News