కొడుకుని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా..

కని పెంచిన తండ్రే కొడుకు పాలిట కాలయముడయ్యాడు. కొడుకు పై విచక్షణారహితంగా తండ్రి దాడి చేసి హత్య చేసిన సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-02-19 09:40 GMT

దిశ, కేశంపేట : కని పెంచిన తండ్రే కొడుకు పాలిట కాలయముడయ్యాడు. కొడుకు పై విచక్షణారహితంగా తండ్రి దాడి చేసి హత్య చేసిన సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ధనుంజయ తెలిపిన వివరాల ప్రకారం కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తొండుపల్లి హనుమంత్ రెడ్డి (37) షాద్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. మృతుడు హనుమంత్ రెడ్డికి తండ్రి గోవర్ధన్ రెడ్డితో శనివారం సాయంత్రం తమఇంట్లో ఘర్షణ జరిగింది.

కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో ఈ ఘర్షణ పెద్దదయింది. దాంతో గోవర్ధన్ రెడ్డి ఇంట్లోఉన్న ఇనుప గొట్టంతో కొడుకు హనుమంత్ రెడ్డి పై విచక్షణారహితంగా దాడి చేయడంతో హనుమంత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గ్రామసర్పంచ్ తోట ఆంజనేయులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Tags:    

Similar News