ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల పీఎస్ పరిధిలోని అయ్యప్పనగర్
దిశ, పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల పీఎస్ పరిధిలోని అయ్యప్పనగర్ వద్ద NH167Aలో హైదరాబాద్ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ కందుకూరు డీపీవో ఆర్టీసీ బస్సు, Ap39U1090 ఆటో, అయ్యప్ప నగర్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా ఆటోను ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.