ప్రమాదవశాత్తు కింద పడి భవన నిర్మాణ కార్మిక మేస్త్రి మృతి..
ప్రమాదవశాత్తు కిందపడి భవన నిర్మాణ కార్మిక మేస్త్రి మృతి చెందిన సంఘటన వడియారం గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, చేగుంట : ప్రమాదవశాత్తు కిందపడి భవన నిర్మాణ కార్మిక మేస్త్రి మృతి చెందిన సంఘటన వడియారం గ్రామంలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కరీంనగర్ గ్రామానికి చెందిన పోచయ్య (56) స్థానికంగా భవన నిర్మాణ కార్మిక పనులు చేస్తూ జీవనం గడుపుతున్నాడు.
ప్రతిరోజు లాగే పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో తనతో పాటు వచ్చిన కూలీలను వడియారం గ్రామంలో దింపడానికి వచ్చాడు. కూలీలను దింపి తిరిగి వెళ్లేక్రమంలో అకస్మాత్తుగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని శవాన్ని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.