దళితబంధు పేరుతో మోసగించిన వ్యక్తులపై కేసు
దళితబంధు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తులపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది.
దిశ, కారేపల్లి : దళితబంధు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తులపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం గుంపెళ్లగూడెంకు చెందిన ఎర్రబెల్లి సుమన్ కు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథంకంలో లబ్ధిదారుని చేర్చుతామని అదే గ్రామానికి చెందిన బానోత్ వీరన్న, బానోత్ అశోక్, బానోత్ సీత్యా లు రూ.2.40 లక్షలు తీసుకున్నారు. పథకంలో లబ్ధిచేకూర్చకపోగా తిరిగి పైకం ఇవ్వటం లేదు. వీరు మరి కొందరిని సైతం ఇదే విధంగా మోసగించినట్లు సమాచారం. మోసగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం తెలిపారు.