48 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా
48 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి.. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: 48 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి.. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గురైన బస్సు విద్యార్థులతో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.