స్పా ముసుగులో వ్యభిచారం.. పట్టుబడ్డ 8 మంది యువతులు
పోలీసులు, అధికారులు ఎన్ని దాడులు నిర్వహించిన ఏదొక రూపంలో వ్యభిచారాలు జరుగుతూనే ఉన్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు, అధికారులు ఎన్ని దాడులు నిర్వహించిన ఏదొక రూపంలో వ్యభిచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త రూపాలలో ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఇది విజయవాడ పడమటలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
గురునానక్ కాలనీలోని ఎన్‌ఏపీ కల్యాణ మండపం సమీపంలో కేస్టూడియో భవనంలో కొందరు యువతులు స్పా సెంటర్‌ను నిర్వహించారు. అయితే అది పేరుకు మాత్రమే స్పా సెంటర్ అని.. లోపల జరిగేదంతా వ్యభిచారమేనని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ కాశీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రైడ్‌లో ఇద్దరు నిర్వాహకులు.. 8 మంది యువతులు.. ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read More....