విషాదం..5వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
దిశ,వెబ్డెస్క్: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తన కొడుకు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న ఆ కన్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ క్రమంలో ఆమె తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా? ఇంత మంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారు.. అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.