పాపం పసివాడు.. స్కూల్ బస్ కింద పడి ప్రాణం వదిలాడు..

జనగామ జిల్లా కొడకండ్ల మండలం సీఎం తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీఎం తండాలోని రత్య తండాకు చెందిన వంకుడోత్ రమేష్ కుమారుడు శ్రీహాన్ (2) స్కూల్ బస్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

Update: 2024-11-21 04:54 GMT

దిశ, కొడకండ్ల/పాలకుర్తి : జనగామ జిల్లా కొడకండ్ల మండలం సీఎం తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీఎం తండాలోని రత్య తండాకు చెందిన వంకుడోత్ రమేష్ కుమారుడు శ్రీహాన్ (2) స్కూల్ బస్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంకుడోత్ రమేష్ కుమార్తె బాల యేసు పాఠశాలలో చదువుతోంది. గురువారం ఉదయం 8:30 గంటలకు రమేష్ భార్య తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కించడానికి తన కుమారుడు శ్రీహాన్‌తో కలిసి బస్సు వద్దకు వచ్చారు.

కూతురిని బస్సు ఎక్కించి, ఆమెతో మాట్లాడుతున్న క్రమంలో శ్రీహాన్ ను తల్లి పక్కన నిలబెట్టుకున్నారు. ఇంతలో తల్లి కూతురికి, బుక్స్, టిఫిన్ బాక్స్,అందిస్తున్న క్రమంలో శ్రీహాన్ బస్సు టైర్ సమీపానికి చేరుకున్నాడు. డ్రైవర్ బస్సును కదలించగానే బాలుడు బస్సు కింద పడిపోయి మరణించాడు. బాలుడు అరవడంతో డ్రైవర్ బస్సును ఆపినప్పటికీ, అప్పటికే శ్రీహాన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ దుర్ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది స్కూల్ బస్సుల పై జాగ్రత్తల గురించి తిరిగి ఆలోచింపజేస్తున్న ఘటనగా నిలిచింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News