Sex With Student : స్టూడెంట్‌తో సెక్స్.. మహిళా టీచర్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళా టీచర్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష పడింది.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళా టీచర్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. టీనేజ్ విద్యార్థితో పలుమార్లు సెక్స్ చేసినందుకు గాను కోర్టు ఉపాధ్యాయురాలికి మూడు దశాబ్ధాల పాటు జైలు శిక్ష విధించింది. ‘థర్డ్ డిగ్రీ సెక్స్’ అఫెన్స్ కింద ఈ శిక్షను కోర్టు ఖరారు చేసింది. 32 ఏళ్ల మెలిస్సా కర్టిస్ ఈ దారుణానికి పాల్పడింది. విడుదలైన తర్వాత కూడా 25 ఏళ్లు లైంగిక నేరస్థురాలిగా తన పేరును నమోదు చేసుకోవాలని కోర్టు కండిషన్ విధించింది. టీచర్ తన పిల్లలతో మాత్రమే ఉండాలని మైనర్లకు ఆమెను దూరంగా పెట్టాలని కోర్టు ఆదేశించింది. మహిళా టీచర్ 8వ గ్రేడ్ చదువుతున్న విద్యార్థికి అల్కహాల్, మరిజోనా ఇచ్చి 20 సార్లకు పైగా సెక్స్‌లో పాల్గొంది. కర్టిస్ రెండేళ్లుగా లేక్ ల్యాండ్ పార్క్ మిడిల్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదుతో 2023 అక్టోబర్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం థర్డ్ డిగ్రీ సెక్స్ నేరానికి పాల్పడినట్లు టీచర్ అంగీకరించడంతో తాజాగా 30 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది.