అర్ధరాత్రి హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం..10 మంది మృతి

అర్ధాత్రి 12.30 గంటలకు ఓ హస్టల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 10 మంది చనిపోయారు. ఈ విషాద సంఘటన న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న నాలుగు అంతస్తు హాస్టల్‌లో చోటు చేసుకుంది.

Update: 2023-05-16 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: అర్ధాత్రి 12.30 గంటలకు ఓ హస్టల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 10 మంది చనిపోయారు. ఈ విషాద సంఘటన న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఉన్న నాలుగు అంతస్తు హాస్టల్‌లో చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెల్లింగ్‌టన్ హాస్టల్‌లోని పొగలు కక్కుతున్న బిల్డింగ్‌లో సహాయక చర్యలు చేపట్టారు. కాగా రాత్రి మొత్తం ఈ సహాయక చర్చలు నిర్వహించిన అధికారులు తెల్లవారే సమయానికి మంటలు ఆర్పీ మృతదేహాలను వెలికితీశారు. అలాగే ఈ ప్రమాదంలో.. మరో 20 మంది ఆచూకీ తెలియలేదు. వెల్లింగ్‌టన్‌లోని లోఫర్స్ లాడ్జ్ హాస్టల్‌లోని 52 మంది వ్యక్తుల కోసం లెక్కించామని, అయితే అగ్నిమాపక సిబ్బంది ఇతరుల కోసం వెతుకుతున్నారని వెల్లింగ్టన్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నిక్ ప్యాట్ తెలిపారు.

Tags:    

Similar News