దిశ, వెబ్డెస్క్: రెండేళ్లుగా తన పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న.. రిలీజ్ చేయకుండా జాప్యం చేయడంతో విసిగిపోయిన నర్స్ నడిరోడ్డుపై బట్టలు విప్పి నిరసన తెలిపింది. ఈ ఘటన బుధవారం జైపూర్ లోని మంత్రసాని రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయక నర్సు గా చేస్తున్న మహిళా రెండేళ్లుగా పోస్టింగ్ ఆర్డర్ ల కోసం ఎదురు చూస్తుంది. పలుమార్లు సీనియర్ అధికారులకు సంప్రదించినా తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆమె ఈ విధంగా నిరసన తెలిపినట్లు తెలిపారు. అలాగే రోడ్డుపై నగ్నంగా నిరసన తెలిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎస్ఎంఎస్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నవరత్న ధులియా తెలిపారు.