రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు 6శాతం తగ్గాయి: డీజీపీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం రాష్ట్ర వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయని, హత్యలు 8.5శాతం, మహిళలపై నేరాలు 1.9శాతం, రోడ్డుప్రమాదాలు 13.9శాతం, వైట్ కాలర్ నేరాలు 42శాతం తగ్గాయని పేర్కొన్నారు. 48.5శాతం మంది నేరస్థులకు శిక్షపడిందని, సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఏ ఏడాది […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నేరాలు 6శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం రాష్ట్ర వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని రకాల నేరాలు తగ్గాయని, హత్యలు 8.5శాతం, మహిళలపై నేరాలు 1.9శాతం, రోడ్డుప్రమాదాలు 13.9శాతం, వైట్ కాలర్ నేరాలు 42శాతం తగ్గాయని పేర్కొన్నారు. 48.5శాతం మంది నేరస్థులకు శిక్షపడిందని, సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఏ ఏడాది కొత్తగా 99వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీజీపీ.. రాష్ట్రవ్యాప్తంగా 6.65లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాల ద్వారా 4,490 కేసులు పరిష్కరించామని, లాక్‌డౌన్ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 11మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 135మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పోలిసింగ్ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చామని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిగా విజయవంతం అయ్యిందని డీజీపీ వెల్లడించారు.