ప్రధాని మోడీకి క్రికెటర్ ‘ఆండ్రు రస్సెల్’ స్పెషల్ థ్యాంక్స్..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. వైరస్ నివారణకు ఇప్పటికే వివిధ దేశాలు వ్యాక్సిన్లు తయారు చేయగా, ఇండియా మేడ్ కరోనా టీకాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. టీకాలు అందుబాటులోకి వచ్చాక కరోనా సెకండ్ వేవ్ ప్రభలుతుండటంతో ఆయా దేశాలు వైరస్ కట్టడికి తగు చర్యలు చేపడుతున్నాయి. బ్రిటన్ లాంటి దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా ప్రపంచంలోని పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు అందజేసేందుకు ముందుకు వచ్చింది. […]

Update: 2021-03-18 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. వైరస్ నివారణకు ఇప్పటికే వివిధ దేశాలు వ్యాక్సిన్లు తయారు చేయగా, ఇండియా మేడ్ కరోనా టీకాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. టీకాలు అందుబాటులోకి వచ్చాక కరోనా సెకండ్ వేవ్ ప్రభలుతుండటంతో ఆయా దేశాలు వైరస్ కట్టడికి తగు చర్యలు చేపడుతున్నాయి. బ్రిటన్ లాంటి దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా ప్రపంచంలోని పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు అందజేసేందుకు ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఆఫ్రికాలోని పేద దేశాలకు టీకాలను పంపించగా ఈ విషయంపై జమైకా క్రికెట్ ఆటగాడు ఆండ్రు రస్సెల్ స్పందించాడు. తమ దేశానికి భారత్ అందించిన సాయాన్ని మర్చిపోలేమని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, ఇండియన్ హైకమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. దీనికి సంబంధించి ఓ వీడియాను రిలీజ్ చేసిన రస్సెల్.. ఇకమీద జమైకా అండ్ ఇండియా దేశాలు అన్నదమ్ములు అని వ్యాఖ్యానించాడు. కరోనా టీకాలు తీసుకోవడంపై తాము ఉత్సాహంతో ఉన్నామని పేర్కొన్నాడు.

Tags:    

Similar News