సాలిడరిటీ కప్ కొత్త షెడ్యూల్
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో దక్షిణాఫ్రికా సరికొత్త ఫార్మాట్‌లో ఆట ప్రారంభించాలని సంకల్పించింది. 3టీ పేరుతో రూపొందించిన కొత్త ఫార్మాట్‌ను మూడు జట్లతో ‘సాలిడారిటీ కప్’ పేరుతో గత నెలలో నిర్వహించాలని అనుకుంది. అయితే, క్రికెట్ సౌత్ ఆఫ్రికాలో పలువురికి కరోనా సోకినట్లు తేలడంతో వాయిదా వేసింది. తాజాగా జూలై 18న మ్యాచ్ నిర్వహించడానికి నిర్ణయించినట్లు సీఎస్ఏ తాత్కాలిక చీఫ్ జాక్వెస్ ఫౌల్ వెల్లడించారు. సాలిడారిటి కప్ పేరిట నిర్వహిస్తున్న 3టి క్రికెట్ […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో దక్షిణాఫ్రికా సరికొత్త ఫార్మాట్‌లో ఆట ప్రారంభించాలని సంకల్పించింది. 3టీ పేరుతో రూపొందించిన కొత్త ఫార్మాట్‌ను మూడు జట్లతో ‘సాలిడారిటీ కప్’ పేరుతో గత నెలలో నిర్వహించాలని అనుకుంది. అయితే, క్రికెట్ సౌత్ ఆఫ్రికాలో పలువురికి కరోనా సోకినట్లు తేలడంతో వాయిదా వేసింది. తాజాగా జూలై 18న మ్యాచ్ నిర్వహించడానికి నిర్ణయించినట్లు సీఎస్ఏ తాత్కాలిక చీఫ్ జాక్వెస్ ఫౌల్ వెల్లడించారు. సాలిడారిటి కప్ పేరిట నిర్వహిస్తున్న 3టి క్రికెట్ సిరీస్ ద్వారా లభించిన మొత్తాన్ని కొవిడ్–19తో కష్టాలు ఎదుర్కొంటున్న వారి సహాయార్థం వినియోగించనున్నారు.