నా ధరలు నా ఇష్టం.. అడ్డగోలుగా పెంచుతున్న రేట్లు

దిశ, సత్తుపల్లి : కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయినప్పటికీ సత్తుపల్లి పట్టణంలోని శ్రీ వాసు ఫైర్ వర్క్స్ వారు డబ్బే ప్రధానం అంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించకున్నా విక్రయాలు జరుపుతున్నారు. ప్రభుత్వం చెప్పిన ధరలకు కాకుండా ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. సామాన్యులకు ధరలు అందడం లేదు. మాస్కులు లేకున్నా, సామాజిక దూరం పాటించకున్నా, టపాసులను అధిక రేట్లకు అమ్మతున్నారు. అంతే […]

Update: 2021-11-03 07:34 GMT

దిశ, సత్తుపల్లి : కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయినప్పటికీ సత్తుపల్లి పట్టణంలోని శ్రీ వాసు ఫైర్ వర్క్స్ వారు డబ్బే ప్రధానం అంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించకున్నా విక్రయాలు జరుపుతున్నారు. ప్రభుత్వం చెప్పిన ధరలకు కాకుండా ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు.

సామాన్యులకు ధరలు అందడం లేదు. మాస్కులు లేకున్నా, సామాజిక దూరం పాటించకున్నా, టపాసులను అధిక రేట్లకు అమ్మతున్నారు. అంతే కాకుండా, బిల్ పేపర్ లేకుండా ఒక వైట్ పేపర్ మీద రాసి పంపిస్తున్నారు. ఏ రేట్లు దేనికి వేస్తున్నారో ప్రజలకు తెలియకుండా అధిక రేట్లకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో ఇంతింత రేట్లకు అమ్మితే సామాన్యులు పండగ ఎలా చేసుకుంటారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News