‘ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు’
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు అన్నారు. అనుమతి ఇవ్వకపోగా గ్రామగ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని బాబూరావు మండిపడ్డారు. మీడియాపైనా ఆంక్షలు పెట్టడం నిర్బంధానికి పరాకాష్ట అని… అరెస్ట్ […]
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు అన్నారు. అనుమతి ఇవ్వకపోగా గ్రామగ్రామాన వందలాది మంది పోలీసులను మోహరించి ప్రజలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి, శాంతియుతంగా ఆందోళన చేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని బాబూరావు మండిపడ్డారు. మీడియాపైనా ఆంక్షలు పెట్టడం నిర్బంధానికి పరాకాష్ట అని… అరెస్ట్ చేసిన వారందరిని తక్షణమే విడుదల చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు.