కరోనా మృతుల దహనానికి ప్రత్యేక స్థలం కేటాయించాలి

దిశ, ఖ‌మ్మం: ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనాతో మృతిచెందిన శవాల్ని దహనాం చేయడానికి, ప్రత్యేకంగా జన నివాసానికి దూరంగా స్థలం కేటాయించాల‌ని సీపీఐ(ఎం) ఖమ్మం 40, 41వ డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో నగర సూపరింటెండెంట్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనాతో మరణించిన మృతదేహాల్ని ప్రస్తుతం ప్రకాష్‌నగర్ మున్నేటి ఒడ్డున పూడ్చి పెడుతున్నారని అన్నారు. దీని మూలంగా 40, 41వ డివిజన్లలో సుమారు 8 వేల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. […]

Update: 2020-07-13 08:15 GMT

దిశ, ఖ‌మ్మం: ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనాతో మృతిచెందిన శవాల్ని దహనాం చేయడానికి, ప్రత్యేకంగా జన నివాసానికి దూరంగా స్థలం కేటాయించాల‌ని సీపీఐ(ఎం) ఖమ్మం 40, 41వ డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో నగర సూపరింటెండెంట్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల్లో కరోనాతో మరణించిన మృతదేహాల్ని ప్రస్తుతం ప్రకాష్‌నగర్ మున్నేటి ఒడ్డున పూడ్చి పెడుతున్నారని అన్నారు. దీని మూలంగా 40, 41వ డివిజన్లలో సుమారు 8 వేల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. కుక్కలు, పందులు, పశువులు ఈ ప్రాతంలో సంచరిస్తూ ఇళ్ల‌కు వస్తున్నందున గత కొన్ని రోజులుగా ఈ ప్రాత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజా నివాసానికి దూరంగా ప్రత్యేకంగా స్థలం కేటాయించి దహనం చేయాలని కోరారు.

Tags:    

Similar News