రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది వాళ్లే!
దిశ, వాజేడు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు శివ కుమార్‌ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సుడి కృష్ణారెడ్డి అన్నారు. వాజేడు మండల కేంద్రంలో గురువారం జరిగిన సీపీఎం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఏటూరునాగారం మండలం శివపురం గ్రామంలో ధాన్యం రాశిపైనే రైతు శివ కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]
దిశ, వాజేడు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు శివ కుమార్‌ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సుడి కృష్ణారెడ్డి అన్నారు. వాజేడు మండల కేంద్రంలో గురువారం జరిగిన సీపీఎం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఏటూరునాగారం మండలం శివపురం గ్రామంలో ధాన్యం రాశిపైనే రైతు శివ కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజులుగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతు శివకుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, దబ్బకట్ల లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొప్పుల రఘుపతి, మండల కార్యదర్శి బచ్చల కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.