కాగితం రాసిస్తాననడం సిగ్గుచేటు : బివి రాఘవులు

దిశ, ముషీరాబాద్: పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం లేకుంటే రైతులు భూములు అమ్ముకొని కూలీలు కావడం ఖాయం అని దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ నేత బివి.రాఘవులు అన్నారు. మూడు చట్టాలు, విద్యుత్ చట్టం రద్దయ్యేంత వరకూ రైతాంగ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బి.వి.రాఘవులు మట్లాడుతూ… రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 500 […]

Update: 2021-01-05 10:27 GMT

దిశ, ముషీరాబాద్: పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం లేకుంటే రైతులు భూములు అమ్ముకొని కూలీలు కావడం ఖాయం అని దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ నేత బివి.రాఘవులు అన్నారు. మూడు చట్టాలు, విద్యుత్ చట్టం రద్దయ్యేంత వరకూ రైతాంగ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బి.వి.రాఘవులు మట్లాడుతూ… రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 500 రైతు, సామాజిక, ప్రజా కార్మిక సంఘాలు ఐక్యంగా డిమాండ్ చేస్తుంటే 8 సార్లు చర్చలు జరిపిన మోదీ ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా కాగితం రాసిస్తాననడం సిగ్గుచేటన్నారు. నిత్యావసర సరకుల ధరల నియంత్రణ చట్టం సవరణ, విద్యుత్ చట్టం సవరణలు, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీలను ఎత్తేసి ఓపెన్ మార్కెట్‌ల దోపిడీకి ఎరవేసేందుకు సిద్ధ పడుతున్నారని అన్నారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే పాకిస్తాన్, చైనా హస్తం ఉందని, ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నరని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పంటలకు గిట్టుబాలు ధరలు లేకుండా ప్రభుత్వ మండీలకు సమాంతరంగా ప్రైవేటు మండీలకు అనుమతులు ఇవ్వడం, మద్దతు ధరల కోసం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ముందే ఒప్పందం చేసుకోవాలని కాంట్రాక్ట్ చట్టాలు తేవడాన్ని చూస్తుంటే రానున్న రోజుల్లో వ్యవసాయ భూములను కార్పొరేటర్ కంపెనీలకు అప్పగించే కుట్రేనని అన్నారు. కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ… ఆగ్రి బిజినెస్ పేరుతో దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్ శక్తుల దోపిడీకి చట్టబద్దంగా అప్పగించేందుకే మోదీ మూడు చట్టాలు తెచ్చారన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మూడు చట్టాల రద్దుకోసం శాసన మండలిలో తీర్మాణానికి ఒత్తిడి తెస్తామన్నారు.

Tags:    

Similar News