మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. నిషేధిస్తారా?
దిశ, మహాబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మాహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో విరసం, పౌర హక్కుల సంఘం, చైతన్య మహిళా సంఘం, టీవీవీతో […]
దిశ, మహాబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మాహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో విరసం, పౌర హక్కుల సంఘం, చైతన్య మహిళా సంఘం, టీవీవీతో పాటు 16 సంఘాలపై నిషేధం విధించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ చట్టంలో కూడా భావాలపై నిషేధం విధించాలని లేదని, రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రజా సంఘాలపై నిషేధం విధించిందని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ప్రజా సంఘాలపై, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిషేధం విధించడం ఫాసిస్టు విధానానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పిలుపునిచ్చారు.