అందుకోసమే కక్కుర్తి పడ్డారంటున్న సీపీఐ నేత

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజకీయాలు మాని బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. గంగవరం పోర్ట్ ప్రైవేటుకు అప్పచెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కమీషన్‌లకు కక్కుర్తి పడి గంగవరం పోర్ట్‌ను తక్కువకే అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప […]

Update: 2021-08-30 09:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు రాజకీయాలు మాని బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. గంగవరం పోర్ట్ ప్రైవేటుకు అప్పచెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కమీషన్‌లకు కక్కుర్తి పడి గంగవరం పోర్ట్‌ను తక్కువకే అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు.

మరోవైపు రాజధాని విషయంలో కేంద్రం డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. మోడీ ఆమోదం తీసుకున్నాకే జగన్ మూడు రాజధానులు ప్రకటించారని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మాయ చేసినట్లు బొత్స అందరినీ మాయ చేయలేరని విమర్శించారు. రైతులను అవమానించేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చట్టబద్ధమైన ఒప్పందాలను ఈ ప్రభుత్వం గౌరవించదా అని విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రధాని మోడీ స్పందించడం లేదని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News