వరవరరావును పెరోల్‌పై విడుదల చేయాలి
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19తో బాధపడుతున్న ప్రముఖ కవి వరవరరావుకు బెయిల్ లేదా పెరోల్ ఇప్పించేందుకు సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. పత్యేక తెలంగాణ సాధనకు జయశంకర్ కోసం వరవరరావు ఉద్యమించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అన్యాయంగా కుట్ర కేసు మోపబడి మహారాష్ట్ర తలోజ జైల్లో ఉన్నారని, 80 ఏళ్ల వయస్సులో ఆరోగ్యం క్షీణించి, కరోనా […]
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19తో బాధపడుతున్న ప్రముఖ కవి వరవరరావుకు బెయిల్ లేదా పెరోల్ ఇప్పించేందుకు సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. పత్యేక తెలంగాణ సాధనకు జయశంకర్ కోసం వరవరరావు ఉద్యమించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అన్యాయంగా కుట్ర కేసు మోపబడి మహారాష్ట్ర తలోజ జైల్లో ఉన్నారని, 80 ఏళ్ల వయస్సులో ఆరోగ్యం క్షీణించి, కరోనా పాజిటివ్‌తో మానసిక వ్యథకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, తెలంగాణ మేధావులు, ప్రజలు ఆయనను బతికించాలని కోరుకుంటున్నారని, ఇలాంటి సంక్షిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చొరవ చూపాల్సిన అవసరముందన్నారు.