ఏపీ కేబినెట్ విస్తరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సెటైర్లు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హనీమూన్ ముగిసింది. ఇక మొత్తం మంత్రులను మారుస్తారట అంటూ సెటైర్లు వేశారు. మంత్రులను మారుస్తారు కానీ సీఎంగా మాత్రం జగనే ఉంటారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు ఏం పాపం చేశారని మారుస్తారంటూ నిలదీశారు. సీఎం జగన్ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, డీఏ, పీఆర్సీ సకాలంలో ఇవ్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హనీమూన్ ముగిసింది. ఇక మొత్తం మంత్రులను మారుస్తారట అంటూ సెటైర్లు వేశారు. మంత్రులను మారుస్తారు కానీ సీఎంగా మాత్రం జగనే ఉంటారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు ఏం పాపం చేశారని మారుస్తారంటూ నిలదీశారు. సీఎం జగన్ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, డీఏ, పీఆర్సీ సకాలంలో ఇవ్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పుకొచ్చారు. అలాగే నిరుద్యోగులను జగన్ మోసం చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడం లేదని…గొప్పలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ రామకృష్ణ ధ్వజమెత్తారు.