పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి: సీపీఐ రామకృష్ణ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరులో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా ఉద్యోగులు సచివాలయం ఎదుటే పడిగాపులు కాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి ఎందుకు సంకోచిస్తుందని ప్రశ్నించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా […]

Update: 2021-11-12 05:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరులో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా ఉద్యోగులు సచివాలయం ఎదుటే పడిగాపులు కాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి ఎందుకు సంకోచిస్తుందని ప్రశ్నించారు.

ప్రజా సంకల్ప పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కనీసం వారి సమస్యలను విన్నవించడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News