కరోనా దెబ్బకి మాయమైన దేవుళ్లని ఎందుకు తరుముతారు?: నారాయణ
కరోనా దెబ్బకి మాయమైన దేవుళ్లని ఎందుకు ఇంకా తరుముతారని ఏపీ బీజేపీ, వైఎస్సార్సీపీ నేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరికి ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల డబ్బు అందిందని, ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన ఎంపీ కావడంతో నమ్మాల్సి వస్తోందని అన్నారు. ఆయన ఆరోపణలు అవాస్తవాలని నమ్మాలంటే 2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్ఠానం ఎంత […]
కరోనా దెబ్బకి మాయమైన దేవుళ్లని ఎందుకు ఇంకా తరుముతారని ఏపీ బీజేపీ, వైఎస్సార్సీపీ నేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరికి ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల డబ్బు అందిందని, ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన ఎంపీ కావడంతో నమ్మాల్సి వస్తోందని అన్నారు. ఆయన ఆరోపణలు అవాస్తవాలని నమ్మాలంటే 2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్ఠానం ఎంత డబ్బులు పంపించింది అన్న వివరాలు ఆ పార్టీయే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారు ప్రకటించకపోతే విజయసాయిరెడ్డి చెప్పిన మాటలే నమ్మాల్సివస్తుందని హెచ్చరించారు. అలాగే బీజేపీ అధిష్ఠానం ఒకవేళ డబ్బు పంపకపోతే విజయసాయిరెడ్డి పై యాక్షన్ తీసుకుంటారా?లేదా? అనేది తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అబద్ధమని కన్నా, కాదు తాను నిజమే చెబుతున్నానంటూ విజయసాయిరెడ్డిలు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కరోనా దెబ్బకి దేవుళ్లే మాయమైపోతుంటే, ఇంకా వాళ్లను ఎందుకు తరిమేస్తారంటూ నారాయణ సెటైర్లు వేశారు.
Tags: ysrcp, bjp, cpi, kanna laxminarayana, vijayasai reddy, narayana, Coronavirus, Ap