గవర్నర్ సమీక్ష… ప్రభుత్వానికి అవమానమే !
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర గవర్నర్ తమిళి సై రంగంలోకి దిగి ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించిందంటే అది ప్రభుత్వానికి అవమానకరమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స అందడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదులు వచ్చాయంటే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గచ్చిబౌలి టిమ్స్‌ను ప్రారంభించడానికి ఐదు నెలల సమయం కూడా సరిపోవడం లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థపై సమీక్షించాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర గవర్నర్ తమిళి సై రంగంలోకి దిగి ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించిందంటే అది ప్రభుత్వానికి అవమానకరమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స అందడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదులు వచ్చాయంటే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గచ్చిబౌలి టిమ్స్‌ను ప్రారంభించడానికి ఐదు నెలల సమయం కూడా సరిపోవడం లేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థపై సమీక్షించాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకొని, ప్రశ్నించే గొంతులను నొక్కి పెట్టమని పోలీసులకు అధికారం ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనకు సిద్ధమైన సీపీఐ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు.