త్వరలోనే ఆకలి చావులు చూడాల్సి వస్తది..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. మూలిగే నక్కపై తటికాయ పడినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉందని మండిపడ్డారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయా జిల్లా కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరూద్ధంగా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. […]

Update: 2020-06-20 02:45 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. మూలిగే నక్కపై తటికాయ పడినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉందని మండిపడ్డారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయా జిల్లా కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరూద్ధంగా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం నిత్యావసర సరుకులపై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఒక పూట తిని మరో పూట పస్తులతో కాలం వెలదిస్తున్న ప్రజలపై పెరుగుతున్న ధరల కారణంగా మరింత భారం పడుతుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి త్వరలోనే ఆకలిచావులు చూడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శులు బల్ నర్సింహ, పరమేష్ గౌడ్, కొండన్న, విజయరాములు, అంజి, నాయకులు వార్ల వెంకటయ్య, సురేష్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News