అధికారులు అలా చేస్తున్నారని సీపీఐ నిరసన

దిశ,మునుగోడు: గత నెల రోజుల నుండి మునుగోడు – నల్లగొండ రహదారిపై మూడు అడుగులు నీరు ప్రవహిస్తూ రోడ్డు గుంతలుపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఐబీ, ఆర్అండ్ బీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నీరు ప్రవహిస్తున్న రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నల్లగొండకు నిత్యం వందలాది వాహనాలు పోతున్నా రోడ్డుమీద నీరు […]

Update: 2021-09-29 05:22 GMT

దిశ,మునుగోడు: గత నెల రోజుల నుండి మునుగోడు – నల్లగొండ రహదారిపై మూడు అడుగులు నీరు ప్రవహిస్తూ రోడ్డు గుంతలుపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఐబీ, ఆర్అండ్ బీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నీరు ప్రవహిస్తున్న రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నల్లగొండకు నిత్యం వందలాది వాహనాలు పోతున్నా రోడ్డుమీద నీరు ప్రవహిస్తున్నా ఎవరికీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం నీటి ప్రవాహాన్ని పక్కకు మళ్లించకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభించడం సరికాదన్నారు. ఎప్పటికైన వెంటనే నీరు రోడ్డుమీదకు రానీయకుండా చేయాలని, గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చలపతి, సహాయ కార్యదర్శి చాపల శీను, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రం, కైలాస్, కట్కూరి లింగస్వామి, ప్రవీణ్, బాలరాజు, ఖాసీం, మందుల వెంకన్న, తామస్, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News