ఎవడబ్బ సొమ్మని పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తున్నారు

దిశ, ఉత్తరాంధ్ర : ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌లో 19 పార్టీలు పాల్గొననున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. శ్రీకాకుళంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని విమర్శించారు. ప్రభుత్వం రూ.38 కోట్లు బీఎస్‌ఎన్ఎల్‌ సంస్థకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతున్నదని ధ్వజమెత్తారు. […]

Update: 2021-09-16 03:00 GMT

దిశ, ఉత్తరాంధ్ర : ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌లో 19 పార్టీలు పాల్గొననున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. శ్రీకాకుళంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి పాలించే హక్కులేదని విమర్శించారు. ప్రభుత్వం రూ.38 కోట్లు బీఎస్‌ఎన్ఎల్‌ సంస్థకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతున్నదని ధ్వజమెత్తారు. ఎవడబ్బ సొమ్మని ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు.

దేశంలో నెంబర్ వన్ ఆర్థిక నేరస్తుడు ప్రధాని మోడీయేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎలా చెబితే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ చేసే అరాచకాల వల్ల నిఘా విభాగం దేశంలో ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వెలిబుచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీలు లేదని.. ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుని తీరుతామని నారాయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News