పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పిలుపులో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీస్ ముందు ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయిస్తూ నిర్మాణం చేపడుతూ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పక్కకు పెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులపై నిర్మాణం చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షం నేతలు విమర్శించడం […]
దిశ, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పిలుపులో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీస్ ముందు ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయిస్తూ నిర్మాణం చేపడుతూ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పక్కకు పెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులపై నిర్మాణం చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షం నేతలు విమర్శించడం సమంజసం కాదన్నారు.