జిన్‌పింగ్‌ పై కామెంట్స్.. అధికారపార్టీ నేత బహిష్కరణ

దిశ, వెబ్‌డెస్క్ : చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విబేధాలు మళ్లీ బయటపడ్డాయి. కరోనా కష్టకాలంలో చైనాపై ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.. అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన కంపెనీలు ఆ దేశం నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను బహిరంగంగా విమర్శించిన రియల్ ఎస్టేట్ టైకూన్‌ను అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాని చెబుతూ […]

Update: 2020-07-24 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విబేధాలు మళ్లీ బయటపడ్డాయి. కరోనా కష్టకాలంలో చైనాపై ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.. అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన కంపెనీలు ఆ దేశం నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను బహిరంగంగా విమర్శించిన రియల్ ఎస్టేట్ టైకూన్‌ను అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాని చెబుతూ ఈ చర్యలు చేపట్టింది. పార్టీ రాజకీయ, సంస్థాగత, సమగ్రత, పని తదితర వాటిని తీవ్రంగా ఉల్లంఘించినందుకు నేపథ్యంలో రెన్ జికియాంగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు గురువారం కోర్టు ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా 69ఏళ్ల రెన్ అవినీతిపరుడని, లంచాలు తీసుకుంటారని, గోల్ఫ్ సభ్యత్వ కార్డులు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పార్టీ ఆరోపించింది. రెన్ బహిష్కరణను బీజింగ్ జిల్లా పర్యవేక్షక కమిటీ, జిషెంగ్ జిల్లా కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News