మోసం ఒక్కటే.. బాధితులు 1450 మంది
దిశ, వెబ్‌డెస్క్: స్వాధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఏకంగా రూ. 156 కోట్ల వరకు మోసం చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ స్కీమ్‌ల పేరుతో బాధితులకు కుచ్చుటోపి పెట్టారన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలో అనేక మోసలు చేశారని వెల్లడించారు. అమాయక […]
దిశ, వెబ్‌డెస్క్: స్వాధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఏకంగా రూ. 156 కోట్ల వరకు మోసం చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ స్కీమ్‌ల పేరుతో బాధితులకు కుచ్చుటోపి పెట్టారన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలో అనేక మోసలు చేశారని వెల్లడించారు. అమాయక ప్రజల డబ్బుతో భూములు కోనుగోలు చేసిన స్వాధాత్రి.. ఆ భూములను వేరేవాళ్లకు అమ్మేశారన్నారు. ఈ వ్యవహారంలో దాదాపు 1450 బాధితులు ఉన్నారని.. దీనికి ప్రధాన సూత్రదారులైన యార్లగడ్డ రఘు, మీనాక్షి, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. కాగా, ఇటువంటి మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండి.. ఉచితంగా ప్లాట్లు వస్తాయని మోసపోవద్దని సీపీ హితవు పలికారు.