ఎక్కడికీ పోలేవు చిన్నవాడా..!
దిశ, వెబ్‌డెస్క్: భారత అతిపెద్ద సెక్యూరిటీ అండ్ సర్వైలన్స్ బ్రాండ్ ‘సీపీ ప్లస్’.. మరో సరికొత్త సాంకేతికతో ముందుకొచ్చింది. చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈజీట్రాక్ అనే స్మార్ట్ వాచ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. సులభమైన ట్రాకింగ్ విధానం, నిత్యం కనెక్ట్ అయి ఉండటం ఈ వాచ్ ప్రత్యేకత. దీంతో ఈ వాచ్ ధరించిన చిన్నారులు ఎక్కడున్నా తమ తల్లిదండ్రులకు ఇట్టే తెలిసిపోతుందన్న మాట. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో 2016 […]
దిశ, వెబ్‌డెస్క్: భారత అతిపెద్ద సెక్యూరిటీ అండ్ సర్వైలన్స్ బ్రాండ్ ‘సీపీ ప్లస్’.. మరో సరికొత్త సాంకేతికతో ముందుకొచ్చింది. చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈజీట్రాక్ అనే స్మార్ట్ వాచ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. సులభమైన ట్రాకింగ్ విధానం, నిత్యం కనెక్ట్ అయి ఉండటం ఈ వాచ్ ప్రత్యేకత. దీంతో ఈ వాచ్ ధరించిన చిన్నారులు ఎక్కడున్నా తమ తల్లిదండ్రులకు ఇట్టే తెలిసిపోతుందన్న మాట.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో 2016 సంవత్సరంలో 7569మంది చిన్నారులు అపహరణకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రతే ప్రధానంగా మారింది. ఉరుకులు పరుగుల కాలంలో కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టడం పెద్ద సవాలుగా మారింది. ఈ సవాళ్లను అధిగమించేందుకు తీసుకొచ్చిందే ఈజీ ట్రాక్ స్మార్ట్ వాచ్ అని చెబుతున్నారు సీపీ ప్లస్ ఎండీ ఆదిత్య ఖెమ్కా. దేశంలోని ప్రతి ఇంటికీ భద్రత కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. తాము అందించబోయే ఈజీ ట్రాక్ వాచ్.. తమ పిల్లల భద్రతను నిత్యం పర్యవేక్షించే తల్లిదండ్రులకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
Tags : CP PLUS, Launches, EzyTrack, Be Close to Your Kid, Anytime, Anywhere, children protection