కత్తులు దూసిన ఆ ఇద్దరూ ఒకప్పుడు స్నేహితులే..: ద్వారకా తిరమలరావు

దిశ, ఏపీ బ్యూరో: గత నెల 30న విజయవాడలోని తోటవారి వీధిలో కొందరు యువకులు దొమ్మీ తరహాలో పరస్పరం కత్తులు దూసుకుని ఒకరు వర్గం నేత మరణించగా, మరోవర్గం నేత గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ గురించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మీడియాకు చెబుతూ, ఇప్పుడు కత్తులు దూసుకున్న తోట సందీప్, కోడూరి పండు అలియాస్ […]

Update: 2020-06-05 08:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: గత నెల 30న విజయవాడలోని తోటవారి వీధిలో కొందరు యువకులు దొమ్మీ తరహాలో పరస్పరం కత్తులు దూసుకుని ఒకరు వర్గం నేత మరణించగా, మరోవర్గం నేత గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ గురించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మీడియాకు చెబుతూ, ఇప్పుడు కత్తులు దూసుకున్న తోట సందీప్, కోడూరి పండు అలియాస్ కేటీఎం పండు అలియాస్ మణికంఠ ఒకప్పుడు స్నేహితులని చెప్పారు. వీరిద్దరికీ నేర చరిత్ర ఉంది. సందీప్‌పై 13 కేసులుంటే, పండుపై 3 కేసులున్నాయి. వీరిద్దరూ నివాసముండే ప్రాంతాల్లో స్థానికులను ఆందోళనకు గురి చేసేవారు.

వివాదం యనమలకుదురులో 7 సెంట్ల స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ మొదలుపెట్టారు. అయితే ప్రదీప్ రెడ్డి నుంచి రావాల్సిన వాటా రాకపోవడంతో వ్యవహారం సెటిల్ చేయాలంటూ బుట్టా నాగబాబును శ్రీధర్ ఆశ్రయించాడు. దీంతో గత నెల 29న సెటిల్మెంట్ కోసం నాగబాబు, సందీప్ చర్చలు జరుపుతుండగా, పండు ఎంటరయ్యాడు. ఇది వారిద్దరికీ నచ్చలేదు. దీంతో తాము సెటిల్ చేస్తున్న వ్యవహారంలో ఎందుకు ఎంటరయ్యావంటూ పండుకి సందీప్ ఫోన్ చేసి నిలదీశాడు. ఆపై పండు తల్లితో కూడా సందీప్ గొడవపడ్డాడు. దాంతో ఆగ్రహించిన పండు తన అనుచరులతో కలిసి సందీప్ షాపుపై దాడి చేసి వర్కర్లను గాయపరిచాడు. దీంతో ఫోన్‌లో వారిద్దరూ నువ్వెంతంటే నువ్వెంత? అనుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. దమ్ముంటే తనతో తలపడాలని హెచ్చరికలు చేసుకున్నారు. ఆ సాయంత్రం పండు సోషల్ మీడియాలో ఒక సినిమాలో అత్యంత కౄరమైన డైలాగ్‌ను టిక్‌టాక్ చేసి సందీప్‌ను హెచ్చరించాడు.

30వ తేదీన తోటా వారి వీధిలో ఓ ఖాళీ స్థలంలో మాట్లాడేందుకు తమ అనుచరులతో కలిసి వచ్చారు. మాటామాటా పెరగడంతో ఒకరి కళ్లలోకి ఒకరు కారం చల్లుకుంటూ దాడికి దిగారు. కత్తులతో నరుక్కున్నారు. రాళ్లతో కొట్టుకున్నారు. ఇక్కడి హాహాకారాలు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చే సరికి బలమైన గాయాలతో కొందరు పడిఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని సందీప్, పండులను ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ సందీప్ మరణించగా, పండు చికిత్స పొందుతున్నాడు. కరోనా నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్న సమయంలో సంఘటన చోటుచేసుకోవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆరు బృందాలుగా మారి దర్యాప్తు చేపట్టి ఈ ఘటనలో పాలుపంచుకున్న 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 బైక్‌లు, కొబ్బరి బొండాలు నరికే కత్తి, కొడికత్తి, కట్టర్, ఫోల్డింగ్ బ్లేడ్, ఇనుప రాడ్లు వంటి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో విద్యార్థులు పాల్గొనలేదని పోలీసులు తేల్చారు. మరోసారి విజయవాడలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు.

cp dwaraka tirumala rao speaks to media over vijayawada gang war

Tags:    

Similar News