బీకేర్ ఫుల్.. హైదరాబాద్‌లో అటెన్షన్ డైవర్షన్ ముఠాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో మైండ్ డైవర్షన్/అటెన్షన్ డైవర్షన్ ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ తరహా కేసులు వెలుగులోకి రావడంతో సీపీ అంజనీ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అటెన్షన్ డైవర్షన్‌పై ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి.. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటెన్షన్ డైవర్షన్ అంటే.. ఓ వ్యక్తి మైండ్‌ను డైవర్ట్ చేసి.. కొద్దిమేర డబ్బు ఆశ చూపి.. ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో మైండ్ డైవర్షన్/అటెన్షన్ డైవర్షన్ ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ తరహా కేసులు వెలుగులోకి రావడంతో సీపీ అంజనీ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అటెన్షన్ డైవర్షన్‌పై ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి.. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
అటెన్షన్ డైవర్షన్ అంటే.. ఓ వ్యక్తి మైండ్‌ను డైవర్ట్ చేసి.. కొద్దిమేర డబ్బు ఆశ చూపి.. ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి వస్తున్న పలు చోరీ ముఠాలు ఈ అటెన్షన్ డైవర్షన్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. ముందుగా రూ. పది, వంద నోట్లు కింద పడేసి.. మీవేనంటూ నమ్మించి.. ఏకంగా నగదు సంచితో ఉడాయించేసిన ఓ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు.
#Beware of #AttentionDiversion…#HyderabadCityPolice#TelanganaPolice pic.twitter.com/R6A5HXHEd8
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 12, 2021
ఇటువంటి మోసగాళ్ల ట్రాప్‌లో పడి ప్రజలు నష్టపోవద్దు అంటూ సీపీ అంజనీ కుమార్ కోరారు. అటెన్షన్ డైవర్షన్ ముఠాలపై అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని ఇప్పటికే పోలీసులు సూచిస్తున్న విషయం విధితమే.