కొవిడ్ విజృంభన.. హెల్త్ ఇన్సూరెన్స్‌కు భారీ డిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు రూ. కోటి వరకు ఉన్న అధిక మొత్తం ఆరోగ్య బీమా ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి గతేడాది లాక్‌డౌన్ విధించినప్పటి నుంచే ప్రారంభమైంది. కరోనా చికిత్స కోసం పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చుల కారణంగా వీటి డిమాండ్ పెరిగేందుకు దోహదపడుతోందని ప్రముఖ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చబ్రా అన్నారు. ‘2019 చివరి నాటికి అధిక మొత్తంలో బీమా పాలసీలు(రూ. […]

Update: 2021-03-29 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు రూ. కోటి వరకు ఉన్న అధిక మొత్తం ఆరోగ్య బీమా ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి గతేడాది లాక్‌డౌన్ విధించినప్పటి నుంచే ప్రారంభమైంది. కరోనా చికిత్స కోసం పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చుల కారణంగా వీటి డిమాండ్ పెరిగేందుకు దోహదపడుతోందని ప్రముఖ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ చబ్రా అన్నారు. ‘2019 చివరి నాటికి అధిక మొత్తంలో బీమా పాలసీలు(రూ. కోటి) మొత్తం ఆరోగ్య పాలసీల్లో 2 శాతం ఉన్నాయి. ఇప్పుడు అవి 35 శాతానికి పెరిగాయి.

ఈ వృద్ధి అధిక మొత్తంలో బీమా పాలసీలపై పెరిగిన అవగాహనను ప్రతిబింబిస్తుందని’ అమిత్ ఛబ్రా చెప్పారు. ‘2021లో మొదటి మూడు నెలల్లో ఈ విభాగంలో సగటు రూ. కోటి ఆరోగ్య బీమా ప్లాన్‌లు 12.5 శాతంగా ఉన్నాయి. 2020లో ఇదే సమయానికి 9 శాతంతో పోలిస్తే ఇది అధికం. ఈ అధిక మిత్తం బీమా పాలసీలను తీసుకున్న వారిలో 30-40 ఏళ్ల వయసు వారు 55 శాతం వాటాను కలిగి ఉన్నారు. వీరిలో 13 శాతం మందికి ఇదివరకే ఇతర అనారోగ్య సమస్యలున్నాయి. పాలసీబజార్‌లో విక్రయించిన మొత్తం ఆరోగ్య బీమా పాలసీల్లో 35 శాతం రూ. 5 లక్షలకు, 11 శాతం రూ. 10 లక్షల కవర్ చేసేవి ఉన్నాయి. గతేడాది చాలామందికి ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కొంతమంది ఆసుపత్రుల ఖర్చులు రూ. 25 లక్షలు దాటడంతో ఈ మార్పు వేగవంతమైందని’ ఆయన చెప్పారు.

Tags:    

Similar News