ఆ ఇళ్లల్లో ‘హోం ఐసోలేషన్’ హై రిస్క్..!

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా విలయతాండవం చేస్తోంది. మేడ్చల్ జిల్లాలో రోజుకూ వందల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరంభంలో ఎక్కడైనా ఓ పాజిటివ్ కేసు వస్తే హడావిడి చేసే అధికార యం త్రాంగం..ఇప్పుడు వేల సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ క నీస పర్యవేక్షణ కరువైంది. పాజి టివ్ ​వస్తే హోం ఐసొలేషన్ లో ఉండాలని చెప్పి వదిలేస్తున్నారు. సౌకర్యాలు లేకున్నా.. జిల్లాలో కొవిడ్ బాధితులను తమ ఇళ్లలో సౌకర్యాలు […]

Update: 2020-09-10 20:39 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా విలయతాండవం చేస్తోంది. మేడ్చల్ జిల్లాలో రోజుకూ వందల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరంభంలో ఎక్కడైనా ఓ పాజిటివ్ కేసు వస్తే హడావిడి చేసే అధికార యం త్రాంగం..ఇప్పుడు వేల సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ క నీస పర్యవేక్షణ కరువైంది. పాజి టివ్ ​వస్తే హోం ఐసొలేషన్ లో ఉండాలని చెప్పి వదిలేస్తున్నారు.

సౌకర్యాలు లేకున్నా..

జిల్లాలో కొవిడ్ బాధితులను తమ ఇళ్లలో సౌకర్యాలు లే కున్నా హోం ఐసొలేషన్‌లో ఉంచేస్తున్నారని తెలుస్తోంది. కనీసం బాధితులకు వారి ఇంట్లో ప్రత్యేక గది ఉం దా..? లేదా ? అనేది కూడా చూడకుండా ఇరుకు ఇళ్లల్లోనూ బాధితులను పెడుతున్నట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులకు అత్యంత వేగంగా వైరస్ వ్యాపిస్తున్నది. జిల్లాలో మంగళవారం నాటికి 26,073 మందికి వైరస్ సోకింది. వీరిలో 12వేల మందికి చికిత్స పొంది ఇళ్లకు వెళ్లగా, నాలుగు వేల మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 10వేల మందికి పైగా హోం ఐసొలేషన్లో ఉంచేసి, కొవిడ్ బాధితుల భారం నుంచి అధికార యంత్రాంగం తప్పించుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే హోం ఐసొలేషన్ లోని కొవిడ్ బాధితుల కుటుంబాలు ఇప్పుడు వైద్యాధికారుల తీరుతో వైరస్ బారిన పడుతున్నారు.

ఫోన్ చేసినా.. స్పందించరు..

కరోనా వైరస్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి హోం క్వారంటైన్, విషమంగా మారితే ఆస్పత్రికి తరలించాలి. కానీ రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో వైద్య వసతులు కల్పించలేక వైద్యాధికారులు హైరానా పడుతున్నారు. కరోనా బాధితుల వద్దకు ఏఎన్ఎం రెండు రోజులకు వచ్చి మందుల కిట్ ను అందజేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతంలోనూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో వీరిని ఇళ్లల్లోనే ఉంచేస్తుండడంతో ఏఎన్ఎంలు ఒత్తిడికి గురవుతున్నారు. బాధితులు ఫోన్ లో తమ ఆరోగ్య లక్షణాలను వివరించినా.. వైద్యాధికారులు సకాలంలో స్పందించడం లేదు. దీంతో బాధితుల్లో ఒత్తిడి పెరిగి అనారోగ్యాల పాలవుతున్నారు.

తమ పరిస్థితి విషమంగా ఉందని తెలిపితే..రెండురోజులైనా స్పందించడం లేదని శామీర్ పేటకు చెందిన బాధితుడు కిరణ్ తెలియజేశాడు. ఇకపోతే హోం ఐసొలేషన్ లో వయస్సు మీద పడిన బాధితుల గోడు మరో రకంగా ఉంది. తీవ్ర అనారోగ్య సమస్యలున్నా.. శ్యాస అడక ఇబ్బందులకు గురవుతున్నా.. ఆక్సో మీటర్ తో తనిఖీలు చేసేందుకు రావడం లేదని తూంకుంటకు చెందిన 65 ఏళ్ల కొవిడ్ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంత బాధ ఉన్నా కిట్ లో ఉన్న ట్యాబెట్లు మింగుతూ కాలం వెల్లదీస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News