కర్నూలులో కరోనా పేషెంట్ల ధర్నా
దిశ, వెబ్ డెస్క్: వారికి భయంకరమైన మహమ్మారి సోకింది. దీంతో వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. వారు ఇలా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవడం ఉత్తమం. వాళ్లు పొరపాటున బయటకు వస్తే అంతే సంగతులు. వారి ద్వారా మిగతా వారికి కూడా ఆ వ్యాధి సోకే అవకాశముంది. మొత్తంగా వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, వారంతా రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడి జనాలు […]
దిశ, వెబ్ డెస్క్: వారికి భయంకరమైన మహమ్మారి సోకింది. దీంతో వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. వారు ఇలా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవడం ఉత్తమం. వాళ్లు పొరపాటున బయటకు వస్తే అంతే సంగతులు. వారి ద్వారా మిగతా వారికి కూడా ఆ వ్యాధి సోకే అవకాశముంది. మొత్తంగా వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, వారంతా రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడి జనాలు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని పెంచికలపాడు ఆస్పత్రిలో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులో కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నది. అయితే, చికిత్స పొందుతున్న వీరంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. రావడమేకాదు.. కర్నూలు-ఆదోని రహదారిపై భైటాయించి ధర్నా చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు, వసతులు లేవంటూ ఆందోళన చేశారు. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.