ఎన్నికలకు కరోనా అడ్డు కాదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణకు కరోనా మహమ్మారి అడ్డుకాదని, వైరస్ కారణంగా ఎలక్షన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. బిహార్ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇంకా నోటిఫికేషన్ విడుదలే చేయలేదని, ఇప్పుడే పోలింగ్ వాయిదా వేయాలని ఎలా ఆదేశించాలని ప్రశ్నించింది. వాయిదా […]

Update: 2020-08-28 03:02 GMT

న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణకు కరోనా మహమ్మారి అడ్డుకాదని, వైరస్ కారణంగా ఎలక్షన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

బిహార్ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇంకా నోటిఫికేషన్ విడుదలే చేయలేదని, ఇప్పుడే పోలింగ్ వాయిదా వేయాలని ఎలా ఆదేశించాలని ప్రశ్నించింది. వాయిదా వేయడానికి కొవిడ్ 19 సహేతుక కారణం కాదని వివరించింది. అయినా, అన్నిముందు జాగ్రత్తలు తీసుకునే ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుందని పేర్కొంటూ పిటిషన్ డిస్మిస్ చేసింది. నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నది. ఇటీవలే ఎన్నికల్లో పాటించే జాగ్రత్తలను ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News