నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డ్
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందిస్తోన్న నిరంతర సేవలను అభినందించారు. ఇంతటి విపత్తు సమయంలో వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి […]
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందిస్తోన్న నిరంతర సేవలను అభినందించారు. ఇంతటి విపత్తు సమయంలో వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:Collector Prashant Jeevan Patil, Kovid ICU ward, Nalgonda hospital